Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 2:51 pm Posted by : ramakrishna

గంజాయి అక్రమ రవాణా ముఠాపై కామారెడ్డి పోలీసుల కఠిన చర్య

 

. . .  ముగ్గురిపై పీడీ యాక్టు అమలు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

గంజాయి అక్రమ రవాణా ముఠాపై కామారెడ్డి  పోలీసులు మరో కఠిన చర్య తీసుకున్నారు. రూ.1.93 కోట్ల విలువైన 387.128 కిలోల గంజాయి అక్రమ రవాణా కేసులో షేక్ కరీముల్లా ఆలియాస్ కరీం, గైని సుభాష్, షేక్ రహీమ్‌లపై పీడీ యాక్టు కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే నలుగురిపై చర్యలతో ఈ కేసులో మొత్తం ఇప్పటి వరకు ఏడుగురిపై పీడీ యాక్టు అమలు అయిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ “యువత భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులను ఉపేక్షించేది లేదన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.