కామారెడ్డి మున్సిపల్ సమావేశం రసాభాస
అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి మున్సిపల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. గురువారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం చైర్మన్ గడ్డం ఇందుప్రియ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో వీధి దీపాల నిర్వహణపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ వీధి దీపాలు రాకపోవడం పట్ల కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల తరబడి వీధి దీపాలు రావడం లేదన్నారు. లైట్లు ఎప్పుడు బాగు చేయిస్తారని నిలదీశారు. గత కౌన్సిల్ లో జనరల్ ఫండ్ నుంచి 10 లక్షలతో వీధి...