బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో ఇటీవల బీజేపీ సీనియర్ నాయకుడు అనారోగ్యంతో మృతి చెందిన గేరిగంటి నరసింహులు చనిపోవడంతో బుధవారం వారి కుటుంబాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి పరామర్శించాడు. వారి కుటుంబానికి బీజేపీ పార్టీ ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చాడు. ఈ సందర్భంగా నరసింహులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఇన్చార్జ్ శ్రీధర్ రెడ్డి బిజెపి మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ ఉపాధ్యక్షులు అరిగె నరసింహులు బిజెపి కార్యకర్తలు ఉన్నారు.
