నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కామారెడ్డి ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇలా త్రిపాఠి
బాన్సువాడ, బతుకమ్మ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ఎన్నికల విధుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా బుధవారం బాన్సువాడలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయాల్లో నామినేషన్ స్వీకరణ విధానం, నామినేషన్ ఫారాలు, సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. అలాగే మొదటి రోజు ఆయా డివిజన్లు, వార్డు...