కామారెడ్డి జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయి పర్యటన
కామారెడ్డి, బతుకమ్మ : జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర శుక్రవారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. బాన్సువాడలోని ట్యాంక్ బండ్, బీర్కూర్ లోని మంజీర బ్రిడ్జీ, గాంధారి పరిధిలోని గుజ్జల్ తండా, సర్వాపూర్ వాగులను పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎవరు కూడా వాగులు, వంతెనలు దాటవద్దని, సెల్ఫీలు, చేపల వేటకు వెళ్ల వద్దని సూచించారు. అత్యవసర సమయంలో సాయం కోసం డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు.