కేసుల ఛేదన.. సొత్తు రికవరీలో కామారెడ్డి సీసీఎస్ భేష్
10 అంతర్ రాష్ట్ర దొంగల ముఠాల పట్టివేత సీసీఎస్ క్యాప్షన్ పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి, బతుకమ్మ : కేసులో ఛేదన.. సొత్తు రికవరీలో జిల్లాకు అత్యుత్తమ స్థాన దక్కిందని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. కామారెడ్డి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం చేజ్, క్యాచ్, సాల్వ్ (సీసీఎస్) పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో ఈ సంవత్సరం ఆస్తి సంబంధిత దొంగతనాలలో 46శాతం నేరాలను చేదించి 42శాతం సొత్తు రికవరీ చేసి...