Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2025, 9:22 pm Posted by : ramakrishna

కేసుల ఛేదన.. సొత్తు రికవరీలో కామారెడ్డి సీసీఎస్ భేష్

  • 10 అంతర్ రాష్ట్ర దొంగల ముఠాల పట్టివేత
  • సీసీఎస్ క్యాప్షన్ పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పీ రాజేష్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ : కేసులో ఛేదన.. సొత్తు రికవరీలో జిల్లాకు అత్యుత్తమ స్థాన దక్కిందని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. కామారెడ్డి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం చేజ్, క్యాచ్, సాల్వ్ (సీసీఎస్) పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో ఈ సంవత్సరం ఆస్తి సంబంధిత దొంగతనాలలో 46శాతం నేరాలను చేదించి 42శాతం సొత్తు రికవరీ చేసి బాధితులకు అందజేశామని తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రతి రోజు నాఖబంది, పెట్రోలింగ్, బీట్ డ్యూటీలు తీవ్రతరం చేసి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు.  సీసీఎస్ ద్వారా ఈ సంవత్సరంలో అంతర్ రాష్ట్ర గ్యాంగ్ నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచి 10గ్యాంగ్ లను ఇప్పటి వరకు పట్టుకున్నట్లు తెలిపారు. వీటిలో మహారాష్ట్ర 4, మధ్యప్రదేశ్ 3, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఒక్కో గ్యాంగ్ ఉందన్నారు. దొంగిలించిన సొత్తును తిరిగి బాధితులకు అందించడంలో జిల్లా అత్యత్తమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా సీసీఎస్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ ఉస్మాన్, సిబ్బందిని అభినందించి రివార్డు అందజేశామని తెలిపారు. నేరాల నివారణలో ప్రజల వైపు నుంచి సహకారం అవసరమని, ఎలాంటి అనుమానాస్పద వ్యక్లుల కదలికలు ఉన్న, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న వెంటనే సంబంధిత పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. జిల్లా పోలీస్ వ్యవస్థ క్రమశిక్షణ, నిబద్దతతో ప్రజలకు సేవలు అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఏఏస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీదర్, సీసీఎస్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్టొన్నారు.