Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2025, 7:14 pm Posted by : ramakrishna

తెలంగాణ జాగృతిలో కామారెడ్డి బీఎస్పీ నేతలు చేరిక

  • కండువా కప్పి ఆహ్వానించిన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ జాగృతిలో కామారెడ్డి జిల్లా బీఎస్పీ నాయకులు చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సురేశ్ గౌడ్, ఎల్లారెడ్డి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బీఎస్పీ నాయకుడు తలారి బాలరాజ్ జాగృతిలో చేరారు. మంగళవారం బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. బడుగు, బలహీనవర్గాల పక్షాన కల్వకుంట్ల కవిత గారు చేస్తున్న పోరాటాలకు మద్దతునిచ్చేందుకే జాగృతిలో చేరుతున్నామని వారు ప్రకటించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, నాయకులు సంపత్ గౌడ్, నరేశ్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.