కామారెడ్డి బీసీ గర్జన వర్షార్పణం
42 శాతం బీసీ రిజర్వేషన్ల డిక్లరేషన్ సభ వాయిదా త్వరలో నిర్వాహణ తేదీలపై పీసీసీ ప్రకటన కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశంపై జరుపాల్సిన బీసీ గర్జన వాయిదా పడింది. ఈ నెల 15న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగాల్సిన బీసీ గర్జనను భారీ వర్షాల కారణంగా వాయిదా వేస్తూ పీసీసీ ప్రకటన చేసింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు...