Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2024, 2:32 pm Posted by : ramakrishna

కమల్ షా బియాబాని దర్గాలో ఘనంగా  ఉర్సు

నిజామాబాద్, బతుకమ్మ:  నగరంలోని కంఠేశ్వర్  ప్రాంతంలో గల హజ్రత్ కమల్ షా బియాబాని (ఆర్ఏ)లో ఉర్సు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆల్ హజ్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ సజ్జద్ నషీన్ ఇంటి నుంచి శుక్రవారం సాయంత్రం సందల్ చాదర్ తీసుకుని కంఠేశ్వర్ ప్రాంతంలో ఊరేగించారు. ఉత్సవాలు రెండు రోజులపాటు కొనసాగనున్నాయి. ఊరేగింపు తిరిగి  రాత్రి దర్గాకు చేరుకుని సందల్ మాలి చేశారు. ఆ తర్వాత సమ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాకు  చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదర్ వంశస్తుడు మహ్మద్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ.. ప్రతి  ఏటా ఈ ఉర్సు  ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం మహ్మద్ ఖాదర్ వంశస్తులు అందరూ కలిసి ఆల్ హజ్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ ను సజ్జద్ నషీన్ గా ప్రకటించారు. ఉత్సవాల్లో మహ్మద్ అబ్దుల్ అజీజ్, ఖాజామొయినుద్దీన్, జహీర్ హైమద్ ఆలీ, ఎం.ఏ.ఆఫీజ్, కె. మోయిజ్, ఎంఏ ఖాదీర్, కె నసీయొద్దీన్, సమీర్ హైమద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Kamal Shah Biyabani Ursu in Dargah