జాప్యానికి తావులేకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ మంజూరు
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆధునికీకరణకు రూ. 50 లక్షలు మంజూరు నిజామాబాద్ సిటీ బతుకమ్మ : జాప్యానికి తావులేకుండా అర్హులైన లబ్దిదారులకు సకాలంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరు చేయాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర ఎక్సయిజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సోమవారం కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకం కింద లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు...