Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 7:43 pm Posted by : ramakrishna

కల్యాణ లక్ష్మి, షాదీముబారఖ్ లబ్దిదారులకు తులం బంగారం ఇవ్వాలి

. . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

వేల్పూర్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు ఇస్తానన్న తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం లబ్దిదారులకు చెక్కులను పంపిణి చేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు లక్ష పదహార్ల నగదు తో పాటు కాంగ్రెస్ ఇస్తామన్న తులం బంగారం ఇచ్చే వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ తరపున పోరాడుతామన్నారు. ప్రజలకు ఇస్తామన్న హామీలు ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, నిలదీస్తామన్నారు. ప్రజలు కూడా మీ దగ్గరకు వచ్చిన కాంగ్రెస్ నాయకులను హామీల విషయమై నిలాదీయాలనీ ఎమ్మెల్యే కోరారు.