సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న కల్వకుంట్ల కవిత

  ములుగు, బతుకమ్మ :   మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బాగుండాలని సమ్మక్క సారలమ్మలను కోరుకున్నట్లు తెలిపారు. కాకతీయుల వంటి రాజులతో కొట్లాడిన వనదేవతలు సమ్మక్కసారలమ్మలు అని అన్నారు. వారి జాతి కోసం నిలబడి కొట్లాడిన వీరవనితలని, గోవింద రాజు, పడిగిద్ద రాజుల వంశంలో గొప్ప సైనికులు అని కొనియడారు. వారి స్ఫూర్తితోనే మేము తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు....