Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2025, 6:09 pm Posted by : ramakrishna

కాళోజీ సేవలు మరువలేనివి

మోర్తాడ్, బతుకమ్మ : తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకొని కాళోజి జయంతిని మంగళవారం మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య మాట్లాడుతూ తెలుగు భాషా పట్ల కాళోజి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారని గుర్తు చేశారు. తెలుగు భాష పరిరక్షణకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు. పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయురాలు గోదావరిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.