తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలు
బతుకమ్మ, నిజామాబాద్ : తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ భరద్వాజ్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి రచయిత సాహితీవేత్త తెలంగాణ యాస భాష ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు కాళోజి నారాయణరావు జయంతి ని పురస్కరించుకొని నగరంలోని గాజుల్ పేట్ లో గల కాళోజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. లక్ష్మీనారాయణ భరద్వాజ్ మాట్లాడుతూ పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది "అని నినదించిన ప్రముఖ రచయిత కాళోజి నారాయణరావ్ అని కొనియాడారు. అదేవిధంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు...