బతుకమ్మ, నిజామాబాద్ : తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ భరద్వాజ్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి రచయిత సాహితీవేత్త తెలంగాణ యాస భాష ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు కాళోజి నారాయణరావు జయంతి ని పురస్కరించుకొని నగరంలోని గాజుల్ పేట్ లో గల కాళోజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. లక్ష్మీనారాయణ భరద్వాజ్ మాట్లాడుతూ పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది “అని నినదించిన ప్రముఖ రచయిత కాళోజి నారాయణరావ్ అని కొనియాడారు. అదేవిధంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉమ్మడి నిజామాబాదు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదేశానుసారం సామజిక తెలంగాణ సాధనలో కాళోజి నిర్దేశించిన తెలంగాణ యాస భాషా సాహిత్యన్ని తెలంగాణ జాగృతి ముందుకు తీసుకెళుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు పంచ రెడ్డి మురళి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.