నివేదిక సమర్పించిన కాళేశ్వరం కమిషన్
హైదరాబాద్, బతుకమ్మ : కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన విచారణ నివేదికను గురువారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జకు నివేదికను అందజేసింది. 2024 మార్చి 14న ఈ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల కుంగివేతపై విచారణ జరిపింది. 115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు నమోదు చేసింది.