Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 May 2025, 10:27 pm Posted by : ramakrishna

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాంగ్రెస్ కక్ష్య పూరిత చర్యలు

  • కేసీఆర్ కు నోటీసులు పండడం పూర్తిగా రాజకీయ కక్ష్య పూరిత చర్య
  • మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ : చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించి,కాళేశ్వరం నిర్మాణం తో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులను ఇవ్వడం కాంగ్రెస్ రాజకీయ కక్ష్యాపూరిత నోటీసులుగానే పరిగణిస్తున్నామని బిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.మంగళవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు తో తెలంగాణ ను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ నోటీసులు పంపడడం కాంగ్రెసొల్లా కమిషన్ల చర్య అని ఆయన దుయ్యబట్టారు. నిద్రాహారాలు లెక్క చేయకుండా తెలంగాణ ప్రజల సాగు నీటి గోస తీర్చేందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారని, దీంతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారిందని పచ్చని పంటలతో విరాజిల్లిందని తెలిపారు.పాలన చేతకాని రేవంత్ రెడ్డి సర్కార్..ప్రజల దృష్టి మరల్చేందుకు అవసరమున్నప్పుడల్లా ఇలాంటి డైవర్షన్ పాలిటీక్స్ చేస్తున్నారని ఆరోపించారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తెలంగాణ సమాజం నమ్మదన్నారు. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ శ్రేయస్సు కోసమే పనిచేసే కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలు చేయడం తెలంగాణ సమాజం సహించదని,సూర్యుడి మీద ఉమ్మి వేయాలని చూస్తే అది మీ మీదే పడుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు.