. . . ఇంటర్ ఫలితాలు జిల్లాలో తిరుగులేని కాకతీయ
నిజామాబాద్, బతుకమ్మ:
పదో తరగతి, ఇంటర్, ఎంసెట్, నీట్, జేఈఈ అడ్వాన్స్ ఇలా ఎ పరిక్ష లోనైనా కాకతీయ రికార్డులకు ఎదురు లేదు. దశాబ్ధాలుగా ఇందూర్ గడ్డపై ఏకచత్రాధిపత్యం కొనసాగిస్తున్న కాకతీయ ఆదివారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రభంజనం రేపింది. ఇంటర్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంకులు స్థాయి మార్కులు సాధించి నిజామాబాద్ జిల్లాలో తనకు ఎదురు లేదని చాటింది. 2025-26 ఇంటర్ ఫలితాలలో కాకతీయ జూనియర్ కళాశాలకు చెందిన సీనియర్ ఇంటర్ ఎంపిసీ విద్యార్థిని మృదుల 996/1000 మార్కులతో స్టేట్ ఫస్ట్, బైపీసీలో తుబా ఫాతిమా 993/1000 , బి కావ్య 993/1000 లు నాలుగో ర్యాంకు సాధించారు. హనీ యా ఉమేమా 991 మార్కులు, వై గౌతమీ 991, డి కౌచిత 987, ఎ. సంజన 987, సిహెచ్ వైష్ణవి 987, ఎన్ రూపానీ 987, కే. కీర్తి 986, టి నిత్య శ్రీ 986, కే అశ్రీత 984 మార్కులతో స్టేట్ ర్యాంకులు సాధించారు. జూనియర్ ఇంటర్మీడియట్ లో.. బి . మనోజ్ణ ఎంపీసీలో 468/470 , ఆర్ అక్షిత 468, ఎస్ భవానీ 467, సాకేత్ 467, ఇస్రా మహీన్ 467, జే శ్రీ నిత్య 467, బైపీసీలో సాయి విగ్నత 436, తమన్నా నాజ్ 436, ఎంఇసీలో శ్రీ వేద 487 మార్కులు సాధించారు.

కాకతీయ కళాశాలలో స్టేట్ ర్యాంక్ స్థాయి మార్కులను సాధించిన విద్యార్ధులను జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ కుమార్ అభినందించారు ఫలితాల అనంతరం కాకతీయ క్యాంపస్ లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకతీయ విద్యా సంస్థల చైర్ పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ… కాకతీయ విద్యార్ధులు ఈ విద్యా సంవత్సరం ఫలితాల శుభారంబాన్నిచ్చారు అన్నారు. ఇంటర్ అద్బుతమైన ఫలితాలకు అధ్యాపకుల ప్రోత్సాహం, విద్యార్థుల లో పోటీ తత్వంతో సాధ్యమైందని అన్నారు. కళాశాలకు చెందిన 90 శాతం మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో కాకతీయ రికార్డులను మున్ముందుకు కొనసాగించడం భవిష్యత్తులో మంచి ఫలితాలకు నాంది అన్నారు. మంచి ఫలితాల సాధనకు పాటుపడిన అధ్యాపకులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ లు చెరుకూరి రజీని కాంత్, రామోజీ, తెజస్విని, రాజా తదితరులు ఉన్నారు.
