నెల రోజుల పాటు కాచిగూడ-నిజామాబాద్‌ డెమూ రైళ్లు రద్దు

హైదరాబాద్‌, బతుకమ్మ : కాచిగూడ-నిజామాబాద్‌మధ్య నడిచే (77601/77602)డెమూ రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు దాకా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్‌ సెక్షన్‌లో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‏కు అదనంగా ఏసీ చైర్‌కార్‌.. లింగంపల్లి-విజయవాడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ (ఎంప్లాయీస్‌ ట్రైన్‌)కు అదనంగా మరొక ఏసీ చైర్‌కార్‌ను జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. శనివారం విజయవాడ నుంచి లింగంపల్లి వచ్చే (12795) ఎక్స్‌ప్రె్‌సలో,...