కబాలి నిర్మాత ఆత్మహత్య

హైదరాబాద్, బతుకమ్మ :  తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కబాలి మూవీ సహ నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి సోమవారం గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఓహోటల్ గదిలో విగతజీవిగా పడి ఉన్న ఆయనను చూసిన సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో ఆయన అరెస్టయిన  విషయం తెలిసిందే. కాగా, కృష్ణ ప్రసాద్ చౌదరిది తెలంగాణలోని ఖమ్మం జిల్లా. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు  తెలియాల్సి ఉంది.