కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం

బతుకమ్మ, ఏర్గట్ల : మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో గల సొసైటీ ఫంక్షన్ హాల్ లో ఓపెన్ టు కబడ్డీ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీంగల్ సిఐ సత్యనారాయణ గౌడ్ పాల్గొని క్రీడ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులను ఉద్దేశించి భీంగల్ సిఐ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ మదకద్రవ్యాలను వాడకూడదని నవ సమాజం నిర్మాణానికి యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించి దేశం అభివృద్ధి లో భాగస్వాములు కావాలని కోరారు. ఇలాంటి క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యతోపాటు ఐక్యతను చాటుతాయని అన్నారు....