నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాకు చెందిన సీనియర్ కబడ్డీ కోచ్ ఎంవీ సుబ్బారావు అనారోగ్యంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. సుమారు 35 ఏళ్లకు పైగా క్రీడరంగంలో ఆయన సేవలందించారు. జాతీయ సీనియర్ కబడ్డీ క్రీడాకారుడిగా రాణించి.. జిల్లా కబడ్డీ సంఘానికి సేవ చేశారు. ప్రస్తుతం జిల్లా కమిటీ సంఘం ఉపాధ్యక్షుడిగా, జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. గతంలో ఒలింపిక్ సంఘం, జిమ్నాస్టిక్ అసోసియేషన్ కి సేవలందించారు. నగరంలోని వినాయక నగర్ మున్నూరు కాపు సంఘ కల్యాణమండపం గల్లీలో గల ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ దగ్గర గల సుబ్బారావు స్వగృహం నుంచి అంతిమయాత్ర మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుందని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి తెలిపారు.