కామారెడ్డి, బతుకమ్మ : జ్యోతిబాపూలే జయంతి ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం ప్రతినిధులు ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంఘాల నాయకులు ప్రజలు విద్యార్థులు యువకులు మహాత్మ జ్యోతిబా పూలేకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, జిల్లా గ్రంథాలయ సమితి చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఆర్డిఓ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాముని సుదర్శన్ నేత, జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ ,జిల్లా మహిళా అధ్యక్షురాలు మంజుల, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాజేందర్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూచిపెంటయ్య , టౌన్ ఉపాధ్యక్షుడు మహేందర్, ఎస్ ఎస్ నగర్ ఇన్చార్జ్ మామిడి రాజేష్, పుల్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.