జ్యోతిబా పూలే పాఠశాలలో రాత్రి బస చేసిన కలెక్టర్
నిజామాబాద్, బతుకమ్మ : బోధన్ పట్టణంలో కొనసాగుతున్న ఎడపల్లి మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ పాఠశాలలో కలెక్టర్ గురువారం రాత్రి బస చేశారు. పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెనూ తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్ జైపాల్ ను అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ భేటీ అయ్యారు. పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులను పలు...