అణగారిన వర్గాలకు విద్య కోసం పోరాడిన మహానీయుడు జ్యోతిబా పూలే
. . . ఆర్ఎస్ పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సమాజంలో అణగారిన వర్గాల కోసం మొదటిసారి విద్య హక్కు కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని ఆర్ఎస్ పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు అన్నారు. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు....