Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 April 2025, 6:31 pm Posted by : ramakrishna

జ్యోతి బా ఫూలే జయంతి వేడుకలు

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని చరిత్ర విభాగం మరియు జాతీయ సేవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం 198 వ జ్యోతి బా ఫూలే జయంతి నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మి నారాయణ తెలిపారు. కళాశాలలో జరిగిన జ్యోతి బా ఫూలే జయంతి సందర్బంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ లక్ష్మి నారాయణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం చంద్ర కాంత్, కళాశాల టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు జ్యోతి బా ఫూలే ఫొటోకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ భారత దేశంలో బాలికలకు చదువును ఫోకస్ చేసిన వ్యక్తి జ్యోతి బా ఫూలే అని తెలిపారు. విద్యార్థులు ఎడ్యుకేషన్ అనే వెపన్ ను గట్టిగా పట్టుకోవాలని విద్యార్థులకు గుర్తు చేసారు. చదువు యొక్క గొప్ప తనం విద్యార్థులకు ప్రిన్సిపాల్ వివరించారు.విద్యార్థులు కళాశాలలో ప్రతి రోజు ఇంగ్లీష్ మాట్లాడాలని తెలిపారు. జ్ఞానం అనేది చదువు ద్వారా అని అది దేశానికి జ్యోతి బా ఫూలే అందిచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ లక్ష్మి నారాయణ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. చంద్రకాంత్,టి ఎస్ కే సి కన్వీనర్ జె.శివకుమార్,జాతీయ సేవ సమితి అధికారి  రాణి,అధ్యాపకులు డాక్టర్ నాగానిక, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ గంగారెడ్డి, డాక్టర్ సిద్దురాజు,కృష్ణ ప్రసాద్, శశిధర్, రాణి, సంతోష్, మోయిన్, సంగీత,కీర్తి స్వప్న,దశరథ్,కిరణ్ కుమార్,మహమూద్, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.