Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2024, 5:44 pm Posted by : ramakrishna

గోసంగి కులస్తులకు తగిన న్యాయం చేయాలి

  •  జిల్లా అధ్యక్షుడు ఇర్నాల వినోద్ కుమార్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  సమాజంలో నిజమైన గోసంగి ఎస్సీ కులానికి చెందిన తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో, పథకాల్లో  తగిన న్యాయం చేయాలనిజిల్లా అధ్యక్షుడువినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం జిల్లా కలెక్టరేట్ వచ్చి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన గోసంగి ఎస్సీ కులస్తులకు చెందినవారికి ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గూసంగి కులవృత్తి ద్వారా తాము కుటుంబ పోషణ చేసుకుంటూ జీవనం సాగిస్తామని అయితే అగ్రకులాలకు చెందిన  కొందరు ఎదగనీయకుండా కుట్ర పన్నుతున్నారని ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 1977 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 8 3 8 ప్రకారం తమ కుల ధ్రువీకరణ పత్రం నందు గోసంగి అని నమోదు చేసి కుల ధ్రువపత్రం జారీ చేయవలసిందిగా ఉత్తర్వి జారీ చేసే విధంగా గోసాయి కులము ఒకటై అని స్పష్టమైన నిర్దేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. ఇప్పటికీ పాలకులు అధికారులు తమను తమ వివక్ష చూపడం సరైనది కాదన్నారు.