Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 August 2025, 10:13 pm Posted by : ramakrishna

దళిత మహిళకు న్యాయం చేయాలి

  • బాన్సువాడ డీఎస్పీ ని కోరిన  దళిత, ముస్లిం నాయకులు

 

బీర్కూర్, బతుకమ్మ: బీర్కూర్‌కు చెందిన దళిత యువతి జ్యోతితో, అదే గ్రామానికి చెందిన బీసీ వర్గానికి చెందిన నర్ర సాయలు ప్రేమ పేరుతో 15 సంవత్సరాలుగా కాపురం చేశాడు. ఈ దంపతులకు ప్రస్తుతం వయస్సు 8 సంవత్సరాల బాబు ఉన్నాడు. అయితే ఇటీవల నర్ర సాయలు ఆమెను వదిలి దూరం కావడం జరిగింది.  ఈ అన్యాయంపై బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ దళిత–ముస్లిం నాయకులు బుధవారం బాన్సువాడ డీఎస్పీ శ్రీ వెంకట్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. డీఎస్పీ వెంకట్ రెడ్డి స్పందిస్తూ, బాధితురాలైన జ్యోతికి చట్టపరంగా అన్ని విధాలుగా న్యాయం కలిగించేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత దళిత మహిళకు తక్షణం న్యాయం కలగాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బంగారు సాయిలు, షేక్ హుస్సేన్, కేశపల్లి రవి, ఆన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Justice should be done to Dalit women