’న్యాయమే గెలిచింది’.. నేషనల్‌ హెరాల్డ్‌ కేసుపై  ఖర్గే వ్యాఖ్య

డిల్లీ, బతుకమ్మ :  నేషనల్‌ హెరాల్డ్‌ కేసు అంశంలో న్యాయమే గెలిచిందని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యనించారు. సోనియా, రాహుల్‌పై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకునేందుకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు నిరాకరించడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. బుధవారం ఆయన డిల్లీలో విలేకరులతో మాట్లాడారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్య అని విమర్శించారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను 1938లో స్వాతంత్య్ర సమరయోధులు నెలకొల్పరన్నారు. సీబీఐ, ఈడీలను ఉపయోగించి కాంగ్రెస్ నాయకులను, గాంధీ కుటుంబ సభ్యులను...