Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 9:14 pm Posted by : ramakrishna

అటవి శాఖ అధికారులపై దాడి కేసులో న్యాయం గెలిచింది…

 

. . . ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మోహన్ బట్ వెల్లడి

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో అటవిశాఖ అధికారులపై విచక్షణ రహితంగా దాడులు చేస్తూ ప్రభుత్వానికి చెందిన అటవిశాఖ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించగా ఆయా ప్రాంతాల్లో అధికారులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ ఆటవి రేంజ్ అధికారి చోలే అనిత పై మాజీ  ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కొమరం భీం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావుకు ఆరు నెలల జైలు శిక్ష విధించడం పై ఇందల్వాయి ఆటవి రేంజ్ అధికారి రవి మోహన్ బట్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని నమ్మకంతోనే అటవిశాఖ అధికారులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆసిఫాబాద్ ఎఫ్ఆర్ఓ అనిత పై దాడి చేయడం ఆయన అభివర్ణించారు. చట్టం ముందు అందరూ సమానులని ఈ చర్య తేటతెల్లం చేసిందన్నారు. ఈ సంఘటనతో రాష్ట్రంలోని ఆటవిశాఖ అధికారులపై దాడులు చేయడానికి భయపడే పరిస్థితి డిపార్ట్మెంట్ సృష్టించిందని ఆయన అభివర్ణించారు. ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగాన్ని గౌరవించి మెసలుకోవాలని ఇందల్వాయి ఆటవిశాఖ అధికారి రవి మోహన్ బట్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి బీట్ అధికారులు, సెక్షన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.