. . . ఆదానీపై ఆరోపణలున్నా మోడి అటువైపేనా?
. . . ఎమ్మెల్సీ కవిత సంచలన ట్విట్
నిజామాబాద్, బతుకమ్మ :
అఖండ భారతంలో ఆదానీకో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా? అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్విట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తరువాత తొలిసారి సోషల్ మీడియా వేదికగా కవిత చేసిన ట్విట్ సంచలనమైంది. ఆదారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం, ఈజీ ఆధారాలున్నా ఆదానీని అరెస్టు చేయడం మాత్రం కష్టమానా అని ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని ఆదానీ వైపేనా అని కవిత చేసిన ట్విట్ కలకలం రేపుతుంది.