Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 9:01 pm Posted by : ramakrishna

వృద్ధ దంపతుల కోసం కదిలి వచ్చిన న్యాయం

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామానికి చెందిన  కంటపు సాయమ్మ, గంగారాం వృద్ధ దంపతులు ఓ కేసు విషయంలో న్యాయం కోసం బోధన్ కోర్టుకు వెళ్లారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధ దంపతులు కోర్టు బయట నిలబడడంతో చలించిన అడిషనల్ జడ్డి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయి శివ కోర్టు నుండి బయటకు వచ్చి వృద్ధ దంపతుల సమస్యను అడిగి తెలుసుకుని కేసు వివరాలు సేకరించారు. తమకోసం కోర్టు నుండి బయటకు వచ్చిన న్యాయమూర్తిని చూసి వృద్ధ దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. న్యాయమూర్తి లోని మానవతా దృక్పథాన్ని చూసి కక్షిదారులు, న్యాయవాదులు  ప్రశంసించారు.