Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 January 2025, 7:14 pm Posted by : ramakrishna

జస్టిస్ ఫర్ సాయి చరణ్

  • ప్ల కార్డులతో నిరసన మిషన్ భగీరథ ఉద్యోగులు నిరసన
  • ఎఈఈ ఆత్మహత్యకు కారణాలు తెలియజేయాలి

 

నిజామాబాద్, బతుకమ్మ: జస్టీస్ ఫర్ సాయి చరణ్ అనే నినాదాలతో మిషన్ భగీరథ జిల్లా కార్యాలయం దద్దరిల్లింది. మిషన్ భగీరథ (ఆర్డబ్ల్యూఎస్) ఏఈఈ కే.సాయి చరణ్ ఆత్మహత్యకు పాల్పడడానికి అసలు కారణాలేంటో పూర్తిగా తెలియజేయాలని జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ జిల్లా కార్యాలయం ముందు ఉద్యోగులు జస్టిస్ ఫర్ సాయి చరణ్ అనే ఫ్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు.  జిల్లా కేంద్రంలోని  కార్యాలయం వద్ధ  వారు మాట్లాడుతూ…. మిషన్ భగీరథ లో నవంబర్ 2024 లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన కే.సాయి చరణ్ మంగళవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేయగా వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన ఏం ప్రయోజనం లేకుండా మృత్యువాత పడ్డాడు. ధర్పల్లి మండలంలోని నూతనంగా బాధ్యతలు చేపట్టినప్పటికీ మండలంలో సుమారు 1000 నల్లల వరకు కనెక్షన్లు టార్గేట్ ఉందని అన్నారు. దానిని నల్ల కనెక్షన్లలో కుళాయిలను బిగించుటకు సరైన బడ్జెట్ లేకపోవడంతో  గ్రామపంచాయతీ సెక్రటరీ ద్వారా డబ్బులు చెల్లించుట కూడా ఇబ్బందికరమైన సమస్యలు ఏర్పడిందన్నారు.  దానితో పాటు వేరే ఇతర కారణాలవల్ల, ఒత్తిడిల వల్లనే సూసైడ్ చేసుకోవడం జరిగిందని, ఈ ఆత్మహత్య పాల్పడడానికి గల అసలు కారణాలు ఏంటో.. పూర్తిగా తెలియాలని విచారణ చేపట్టాలని, అసలు ఒత్తిడి కి గల కారణాలు ఏంటో వివరించాలని తోటి ఉద్యోగులు కోరారు. ఈ కార్యక్రమములో మిషన్ భగీరథ డిఈఈ మున్య నాయక్, ఈఈ రాకేష్, ఇతర ఇంజనీర్ లు రాము, ధనరాజ్, దర్మెందర్, దామోదర్, శివ, అజయ్, బస్వరాజ్, గబ్బర్ సింగ్, సంధ్య, రమాదేవి,  కావ్య, ప్రమోద్, గంగారం, అనిల్, ఏఈఈ లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Justice for Sai Charan