జుక్కల్ ఎమ్మెల్యే ఇంటికి బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్
బతుకమ్మ, పిట్లం : బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ వైన్ ఓవెన్, సలహాదారు నళిని రఘురామన్ శుక్రవారం హైదరాబాద్ లోని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ విషయాల గురించి చర్చించారు. జుక్కల్ నియోజకవర్గంలో పెట్టుబడులు పెట్టాలని,అంతర్జాతీయ పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పనకు కృషి చేయాలని, జుక్కల్ నియోజకవర్గానికి రావాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కోరగా గారెత్ వైన్ ఓవెన్ సానుకూలంగా స్పందించారు.