Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 6:56 pm Posted by : ramakrishna

జుక్కల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

జుక్కల్, బతుకమ్మ  :

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడు గా జాదవ్ వీరన్న,ఉపాధ్యక్షులు గడ్డం విజయ్,ప్రధాన కార్యదర్శి నాందేవ్,సహాయ కార్యదర్శి గా గంగారాం,కోటగిరి సతీష్,కోశాధికారి గా అర్జున్ పటేల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సలహాదారులుగా బోడ సాయిలు,పౌడే గంగాధర్,మాధప్ప,దోమల్ వెంకటి,బాలరాజు ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా అధ్యక్షుడు వీరన్న మాట్లాడుతూ…జర్నలిస్ట్ ల సమస్యలపై జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కమిటీలో తీసుకెళ్లి తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.ప్రతి జర్నలిస్టు తమ విలువలను కాపాడుకుంటూ సమాజానికి పనికొచ్చే వార్తలను సేకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.