లెండి ప్రాజెక్టును సందర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులతో కలిసి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుక్రవారం లెండి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రాజెక్టు పనులు పరిశీలించి అధికారులను అడిగి ప్రాజెక్టు ప్లానింగ్ మరియు ఇతర వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతు 35 ఏళ్ల క్రితం ప్రారంభించిన లెండి ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగుతున్నాయని అన్నారు.గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రాజెక్టు పూర్తి అయితే...