Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2025, 5:39 pm Posted by : ramakrishna

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి కేటాయించాలి

బతుకమ్మ: బిచ్కుంద : జుక్కల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కు మంత్రి పదవి కేటాయించలేదని ప్రస్తుత ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలని స్థానిక బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. గురు వారం వారు స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి జుక్కల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరరూ ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు శేకాపూర్ తుకారం మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడు, నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపించే వ్యక్తి లక్ష్మీ కాంతరావు కు మంత్రి పదవి ఇవ్వడం వల్ల జుక్కల్ నియోజకవర్గం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని అన్నారు. అలాగే పిసిసి డెలిగేట్ సభ్యులు విట్టల్ రెడ్డి మాట్లాడుతూ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుపై నియోజకవర్గ ప్రజల ఆదరణ మరువలేనిదిని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి. సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడికి అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చి ఆ దిశగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి వార్డులో ప్రతి పల్లెలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, తాగు, సాగునీరు శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక రచించి ఉన్నామని, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. ఇంతటి మహత్తర వ్యక్తికి అధిష్టానం ఆశీర్వదించి మంత్రి పదవి కట్టబెట్టాలని వారు కోరారు. జుక్కల్ నియోజకవర్గం రిజర్వేషన్ కేటాయించబడిన నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మంత్రి పదవి కేటాయించబడనీ నియోజకవర్గంగా జుక్కల్ నియోజకవర్గం చరిత్రలో నిలిచిందని ఇప్పటికైనా నియోజకవర్గానికి మంత్రి పదవి కేటాయించి సామాజిక న్యాయం చేయాలని బిచ్కుంద మండల కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శేఖాపూర్ తుకారం, పిసిసి డెలిగేట్ సభ్యులు విట్టల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్పల్ గంగాధర్, నౌషా నాయక్, సహీల్ శెట్కర్, సాయిని అశోక్, ఖలీల్, బొగడ మీది సాయిలు తదితరులు పాల్గొన్నారు.