గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే

  జుక్కల్, బతుకమ్మ :   డోంగ్లీ మండలంలోని మారేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని గురువారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ముందు ముందు గ్రామం ఇంకా అభివ్రద్ది చెందాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం నిజాంసాగర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.