జుక్కల్ కాంగ్రెస్ లో భారీగా చేరికలు
జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలం హంగర్గ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వీరందరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా రంజక పాలన, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న తీరు పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే జుక్కల్ నియోజకవర్గం...