జడ్జీలు తమ ఆస్తులను బహిర్గతపర్చాల్సిందే : సుప్రీం

వెబ్ న్యూస్, బతుకమ్మ :   న్యాయమూర్తుల  ఆస్తులకు సంబంధించి సర్వోన్నత  న్యాయస్థానం కీలక చర్యలు తీసకుంది. జడ్జీలు తమ ఆస్తులను బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది. ఈమేరకు ఏప్రిల్ 1 న జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల వివాదం నేపథ్యంలో తాజా పరిణామాలకు ప్రాధాన్యం ఏర్పడింది.