జూబ్లీహిల్స్ నుంచి పోటీకి దానం రెడీ..!

హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లిహిల్స్ టిక్కెట్ విషయంలో దానం నాగేందర్ కూడా ఓ ప్రయత్నం చేశారు. అక్కడ గెలిచిన వారికి మంత్రి పదవి ఖాయమన్న అభిప్రాయం ఉండటంతో ఎవరికో ఎందుకు ఆ చాన్స్ తానే తీసుకుంటానని ప్రతిపాదన పెట్టారు. తాను ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసినందున.. తన అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని.. రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన అనుకుంటున్నారు. అందుకే ముందుగానే రాజీనామా చేసి.. జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేస్తానంటున్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోనూ దానంకు మంచి పట్టు ఉంది....