బతుకమ్మ భిక్కనూరు: ప్రాణహిత చేవెళ్ల 22 ప్యాకేజీ పనులకు రు 23 కోట్లు మంజూరు కావడం పట్ల సోమవారం భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుంట లింగారెడ్డి మాజీ సర్పంచ్ స్వామి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల కాలంలో 22 ప్యాకేజీ పనులకు కనీసం 10 కోట్లు కూడా మంజూరు చేయలేదని అన్నారు. రైతులకు ఈ ప్యాకేజ్ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ మేరకు నిధులు మంజూరుకు కృషి చేసిన ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ తన నివాసంలో శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మయ్య, పలువురు పాల్గొన్నారు.