జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల మంజూరుపై హర్షం

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల మంజూరైంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన హామీ ప్రకారం అగ్రికల్చర్ కళాశాల తీసుకొచ్చినందుకు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల సహకారంతో ఈ కళాశాల మంజూరుకు కృషి చేశానని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కొడంగల్, హుజుర్‌నగర్, నిజామాబాద్‌లకు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేసినందుకు...