Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 12:10 pm Posted by : ramakrishna

జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల మంజూరుపై హర్షం

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల మంజూరైంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన హామీ ప్రకారం అగ్రికల్చర్ కళాశాల తీసుకొచ్చినందుకు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల సహకారంతో ఈ కళాశాల మంజూరుకు కృషి చేశానని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కొడంగల్, హుజుర్‌నగర్, నిజామాబాద్‌లకు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖామంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ కళాశాలతో  విద్యార్థులకు విస్తృత ప్రయోజనం కలుగుతుందన్నారు. అగ్రికల్చర్ కళాశాల మంజూరుతో జిల్లా ప్రజల్లో ఉత్సాహం నెలకొంది.