జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులివ్వాలి
ఇండ్లస్థలాలు కేటాయించి, దాడుల నుంచి రక్షణకు చట్టం చేయాలి టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వినతి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు తీరిపోయి ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా స్టిక్కర్లతో కొనసాగిస్తున్నారని వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధులు కోరారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో అక్రిడేషన్ కమిటీలు వేసి వెంటనే కొత్తవి జారీ చేయాలని డిమాండ్ చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ హడ్ హక్ కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్లో శు...