బీసీ బంద్ కు మద్దతుగా జర్నలిస్టుల ర్యాలీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ చేపట్టిన రాష్ట్ర బంద్ కు నిజామాబాద్ జర్నలిస్టులు మద్దతు తెలిపారు. శనివారం తెలంగాణ రాష్ట్ర బంద్  కు జర్నలిస్టులు సంఘీభావం తెలుపుతూ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రెస్ క్లబ్ నుంచి ప్రారంభమైన జర్నలిస్టుల ర్యాలీ ధర్నాచౌక్ వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అంతడ్పుల రామకృష్ణ, బైర శేఖర్ లు మాట్లాడుతూ బీసీల జనాభా దామాషా ప్రకారం వారికి...