Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 May 2025, 7:11 pm Posted by : ramakrishna

నిరసన గళమెత్తిన జర్నలిస్టులు

  • సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి
  • అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సాక్షి దినపత్రిక ఎడిటర్‌ ధనుంజయరెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని ఏలాంటి అనుమతులు లేకుండా ఇంటిలో సోదాలు నిర్వహించడం సరైంది కాదని డిమాండ్‌ చేస్తు శుక్రవారం జిల్లాలోని అన్ని జర్నలిస్టు సంఘాల నాయకులు కలెక్టరేట్‌ ముందు నిరసన తెలిపాయి. సుమారు రెండు గంటల పాటు జర్నలిస్టులు ఈ నిరసనలో పాల్గొన్నారు. సాక్షి ఎడిటర్‌ ధనుంజయరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. మీడియాపై అంక్షలు విధించడం , అక్రమ కేసులు నమోదు చేయడం ఏమాత్రం సమంజసం కాదని జర్నలిస్టులు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను మానుకోవలన్నారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి ఎడిటర్‌ ధనుంజయరెడ్డికి న్యాయం జరగలంటూ నినాదాలు చేశారు.  ఈ సందర్భంగా ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ… సాక్షి ఎడిటర్‌ ధనుంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడులను ఖండిస్తున్నమన్నారు. ఇలాగే కొనసాగితే జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. వెంటనే అక్రమ కేసులను వెనక్కితీసుకోవలన్నారు. జర్నలిస్టులపై ప్రభుత్వాల ఆజమాయిషీ సరైందికాదన్నారు. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ… ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం సాక్షిదినపత్రికపై దౌర్జన్యం కొనసాగిస్తుందని, అధికార బలంతో అణగదొక్కాలని చూస్తుందన్నారు. ఎడిటర్‌ ధనుంజయరెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వాలు పారదర్శకత పాలన అందించాలని ఇలాంటి కక్షసాధింపు చర్యలతో మీడియా గొంతునొక్కాలని ప్రయత్నాలు చేయడం సరైంది కాదన్నారు. జర్నలిస్టులపై ప్రభుత్వాలు కేసులు, బెదిరింపులు మానుకోవలన్నారు. ప్రజల కోసం నిత్యం పాటుపడే మీడియాకు రక్షన కల్పించవల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. అనంతరం కలెక్టరేట్‌ ప్రవేశ మార్గం నుంచి నిరసనగా అదనపు కలెక్టర్‌ అంకిత్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో సాక్షి బ్యూరో ఇన్‌చార్జి భద్రారెడ్డి, ఎడిషన్‌ ఇంచార్జి ప్రభాకర్, నిజామాబాద్‌ ఆర్సీ ఇంచార్జి సంజీవ్, రూరల్‌ ఆర్సీ ఇంచార్జి మురళి, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు ఆశానారాయణ, జర్నలిస్టు సంఘాల నాయకులు ధనుంజయ్, సదానంద్, రవిబాబు, ఇంగుశ్రీనివాస్, ఉమామహేశ్వర్, కొక్కరవి, ఆంజనేయులు, సాక్షి జిల్లా రిపోర్టుర్లు, మండలాల రిపోర్టర్లు పాల్గొన్నారు.

Journalists protesting