జర్నలిస్టుల నిరసన
బతుకమ్మ బోధన్: బోధన్ పట్టణంలో సాక్షి దినపత్రిక చీఫ్ ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై ఎలాంటి నోటీసులు లేకుండా పోలీసులు దాడులు జరిపిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. శనివారం బోధన్ జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘ నాయకులు మాట్లాడుతూ, ధనుంజయ రెడ్డి పై జరిగిన దాడిని పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్న చర్యగా అభివర్ణించారు. అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను వెలికి తీసే పాత్రికేయులపై ప్రభుత్వం...