సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ గితేను కలిసిన జర్నలిస్టులు
సిరిసిల్లా, బతుకమ్మ : సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులపై కేసుల నమోదు విషయమై గురువారం ఎస్పి మహేష్ గీతేని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులపై కేసులు నమోదు చేసే ముందు తప్పకుండా జర్నలిస్ట్ సంఘాలను ప్రెస్ క్లబ్ బాధ్యులను సీనియర్ జర్నలిస్టులను సంప్రదించాలని అక్రమ వ్యవహారాలలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయడానికి ఏ రకమైన అభ్యంతరం లేదని అయితే వృత్తిపరమైన వార్తలు రాసిన జర్నలిస్టులపై కక్షతో కేసులు నమోదు చేయవద్దని విన్నవించారు. ఇటీవల పోలీసులు జర్నలిస్టులపై నమోదు...